calender_icon.png 2 April, 2025 | 7:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్‌తోనే సమస్యలు పరిష్కారం

26-03-2025 12:30:21 AM

బీఆర్‌ఎస్ సీనియర్ నేత సయ్యద్ అహ్మద్ భక్తి యార్

ముషీరాబాద్, మార్చి 25: (విజయక్రాంతి): బీఆర్‌ఎస్‌తోనే ప్రజలు ఎదుర్కొం టున్న సమస్యలు పరిష్కారం అవుతాయని ముషీరాబాద్ డివిజన్ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు సయ్యద్ అహ్మద్ భక్తీయార్ అన్నారు. ఈ మేరకు మంగళవారం ట్రస్మా ముషీరాబాద్ మండల అధ్యక్షునిగా నియమితులైన సందర్భంగా రంజాన్ మాసంలో పేదలకు తన వంతు సహకారం అందిస్తున్నందుకు అభినందిస్తూ ముషీరాబాద్ బీఆర్‌ఎస్ కమిటీ ఆధ్వర్యంలో శాలువాలు పూలమాలలతో   ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా సయ్యద్ అహ్మద్ భక్తీయార్ మాట్లాడుతూ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజా సమస్యలు తెలుసుకుని స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ సంబంధిత శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు.  ఈ కార్యక్రమం లో ముషీరాబాద్ బీఆర్‌ఎస్ నాయకులు శ్రీధర్ చారి, పూస గోరఖ్నాథ్, డివిజన్ ఉపాధ్యక్షుడు జి. రాజు, లక్ష్మణ్ గౌడ్, సదా, బిఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.