న్యూఢిల్లీ, ఏప్రిల్ 28 : హమాస్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ చేస్తు న్న యుద్ధానికి మద్దతు ఇవ్వడంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు నిరసన సెగ తగిలింది. అమెరికా ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం రాత్రి ఓ హోటల్లో కరస్పాం డెన్స్ అసోసియేషన్ వార్షిక విందు లో పాల్గొనాల్సి ఉండగా పాలస్తీనా మద్దతుదారులు నిరసన వ్యక్తం చేశారు. వందల సంఖ్యలో అక్కడకు చేరుకొని పాలస్తీనా జాతీయ జెండా లు, బ్యానర్లు చేతబూని నినాదాలు చేశారు. ఇజ్రాయెల్‌కు మద్దతును ఉపసంహరించుకోవాలని కోరారు. నిరసనకారులను దాటుకొని ముందు నుంచి హోటల్లోకి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో వెనుక భాగం నుంచి లోపలికి వెళ్లారు.