12-04-2025 11:44:40 PM
కోదాడ: కోదాడ మండల పరిధిలోని గణపవరం గ్రామంలో ఉన్న శ్రీ వరవర రంగనాయక స్వామి జాతర మహోత్సవం సందర్భంగా రంగనాయక స్వామి కమిటీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహించారు. వీటిలో మొదటి బహుమతి జంగం మౌనిక, రెండవ బహుమతి పూరం శెట్టి లత, మూడవ బహుమతి బండారి త్రివేణి, నాలుగో బహుమతి సోమవరపు రాజేశ్వరి, 5వ బహుమతి కంపసాటి మానసలకు దేవాలయ కమిటీ చైర్మన్ ఇర్ల లక్ష్మారెడ్డి, గ్రామ పెద్దల సమక్షంలో బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కంపసాటి నాగరాజు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.