22-03-2025 05:24:58 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి మండలంలోని ఆకెనపల్లి ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు శనివారం ప్రధానోపాధ్యాయులు సాధు లింగయ్య ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు బహుమతులు అందజేశారు. ఈ సంవత్సరంలో వివిధ రంగాల్లో రాణించిన విద్యార్థులకు బహుమతులు అందించినట్లు వారు తెలిపారు. ఆగస్టు15, చిల్డ్రన్స్ డే, సెప్టెంబర్ 5, జనవరి 26 సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో రాణించిన విద్యార్థులను మెమొంటోలు అందజేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్ ఎస్.కె రాజ్మహమ్మద్ పాల్గొన్నారు.