calender_icon.png 15 October, 2024 | 8:51 AM

పోటీల్లో విజేతలకు బహుమతులు

15-10-2024 12:31:33 AM

అందించిన కౌన్సిలర్ మహేశ్

నారాయణపేట, అక్టోబర్ 14 (విజయక్రాంతి): దసరా పండుగను పురస్కరించుకుని   డ్యాన్స్, సింగింగ్, ఆటల పోటీలను 9వ వార్డు కౌన్సిలర్ మహేశ్  ఆధ్వర్యంలో నిర్వహించారు. విజేతలకు సోమవారం మహేశ్ బహుమతులు అందించారు. వార్డులోని మహిళలకు వాయినాలు పంపిణీ చేశారు. మహేశ్ యూత్ ఆధ్వర్యంలో జూనియర్, సీనియర్ స్థాయిలో క్రికెట్ పోటీలు నిర్వహించారు.

మొదటి బహుమతిగా రూ.12,222, రెండవ బహుమతిగా రూ.6,666 నగదును  అందజేశారు. బతుకమ్మను రంగురంగుల పూలతో పేర్చిన మహిళలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మహేశ్ మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలన్నారు.