నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలో సమతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలు ఆదివారం ముగిసాయి. ఈ పోటీలో గెలుపొందిన నరసాపూర్ జట్టుకు రూ.10,000 రెండో స్థానంలో నిలిచిన గొల్ల మోడ జట్టుకు రూ.5000 నగదు మోడల్స్ ఫౌండేషన్ చైర్మన్ సమత సుదర్శన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.