calender_icon.png 17 January, 2025 | 1:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెమీస్‌లో ప్రియాన్షు

07-07-2024 12:26:37 AM

  • కెనడా బ్యాడ్మింటన్ టోర్నీ 
  • క్వార్టర్స్‌లో గాయత్రి జోడి ఓటమి

కల్గరీ (కెనడా): కెనడా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత ఏస్ షట్లర్ ప్రియా న్షు రజావత్ సంచలన ప్రదర్శన కొనసాగుతోంది. శనివారం బీడబ్ల్యూఎఫ్ సూపర్ 500 బ్యాడ్మింటన్‌లో రజావత్ సెమీస్‌లో అడుగుపెట్టాడు. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రియాన్షు 21 17 21 ప్రపంచ నాలుగో ర్యాంకర్ ఆండర్స్ ఆంటోన్‌సెన్ (డెన్మార్క్)పై అద్భుత విజయాన్ని నమోదు చేసుకున్నాడు. గంటకు పైగా సాగిన మ్యాచ్‌లో తొలి గేమ్‌లో రజావత్ పూర్తి ఆధిక్యం ప్రదర్శించాడు. ఒక దశలో ఆంటోన్‌సెన్ గేమ్‌ను టై చేసినప్పటికి రజావత్ వరుసగా ఏడు పాయింట్లు గెలిచి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు.

రెండో గేమ్‌ను కోల్పోయినప్పటికీ మూడో గేమ్‌లో ఫుంజుకున్న ప్రియాన్షు ప్రత్యర్థికి అవకాశమివ్వకుండా మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. మ్యాచ్‌లో 59 ర్యాలీలు గెలిచిన రజావత్ 21 పాయింట్లతో సత్తా చాటాడు. కాగా 22 ఏళ్ల రజావత్ తన కెరీర్‌లో టాప్‌ఱ ప్లేయర్‌ను ఓడించడం ఇదే తొలిసారి. సెమీఫైనల్లో అలెక్స్ లానియర్ (ఫ్రాన్స్)తో ప్రియాన్షు అమీతుమీ తేల్చు కోనున్నాడు. మహిళల డబుల్స్ విభాగంలో గాయత్రి గోపిచంద్ జాలీ జోడీ క్వార్టర్స్‌కే పరిమితమైంది. డబుల్స్ క్వార్టర్స్‌లో గాయత్రి జంట 18 21 16 షాన్ సీహ్ హంగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓటమి చవిచూసింది.