calender_icon.png 20 January, 2025 | 2:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రిక్వార్టర్స్‌లో ప్రియాన్షు

05-07-2024 01:53:25 AM

  • అనుపమ, తాన్యాలు ముందంజ 
  • కెనడా ఓపెన్ బ్యాడ్మింటన్

కాల్గరీ (కెనడా): కెనడా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ షట్లర్ ప్రియాన్షు రజావత్ సంచలనం నమోదు చేశాడు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో రజావత్ 17 21 21 8వ సీడ్ రాస్మస్ గెమ్కే (డెన్మార్క్)ను చిత్తు చేసి ప్రిక్వార్టర్స్‌లో ప్రవేశించాడు. గంటకు పైగా సాగిన మ్యాచ్‌లో తొలి గేమ్‌ను కోల్పోయిన రజావత్ ఆ తర్వాత ఫుంజుకొని వరుసగా రెండు గేములు గెలవడంతో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు.

ప్రిక్వార్టర్స్‌లో రజావత్ జపాన్‌కు చెందిన తకుమా ఒబయాషితో తలపడనున్నాడు. మిగిలిన మ్యాచ్‌ల్లో ఆయుష్ శెట్టి, శంకర్ ముత్తుస్వామిలు పరాజయం చవిచూశారు. మహిళల సింగిల్స్‌లో తాన్యా హేమంత్, అనుపమ ఉపాధ్యాయ్ రెండో రౌండ్‌కు చేరుకున్నారు. తొలి రౌండ్‌లో తాన్యా కెనడాకు చెందిన జాకీ డెంట్‌పై, అనుపమ  ఐర్లాండ్‌కు చెందిన రాచెల్ డర్రాగ్‌పై విజయాలు అందుకున్నారు.