హిందువులపై దాడులు ఆగేలా చూడాలని కేంద్రానికి విజ్ఞప్తి
న్యూఢిల్లీ, డిసెంబర్ 17: పాలస్తీనా పౌరులకు సంఘీభావాన్ని ప్రకటించేందుకు సోమవారం కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఆ నినాదం రాసి ఉన్న బ్యాగుతో పార్లమెంట్ వచ్చారు. మంగళవారం ఆమె బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నట్టు రాసి ఉన్న బ్యాగ్‌తో పార్లమెంట్‌కు వచ్చారు. సమావేశాలు ప్రారంభమయ్యే ముందుగా పలువురు ఎంపీలతో కలిసి బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులపై భారత ప్రభుత్వం గళం విప్పాలని డిమాండ్ చేశారు.
అనంతరం ప్రియాంకా గాంధీ లోక్‌సభలో మాట్లాడుతూ.. బంగ్లాదేశ్‌లో పరిస్థితులను చక్కదిద్దేందుకు భారత ప్రభుత్వం చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరపాలని కోరారు. మరోవైపు ఆమె పార్లమెంట్‌కు నినాదాలు రాసి ఉన్న బ్యాగులను తీసుకువ స్తుండడం చర్చనీయాంశమైంది. ఈ అంశంపై బీజేపీ నేతలు ఆమెపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. వాటిపై ప్రియాంక స్పందిస్తూ.. ‘నేను ఏం ధరించాలో? ఏం తీసుకురావాలనేది ఎవరు? ఎందుకు నిర్ణయిస్తారు? నేను కోరుకున్నది ధరిస్తా. తీసుకువస్తా’నని స్పష్టం చేశారు.