calender_icon.png 23 October, 2024 | 4:58 AM

నేడు వయనాడ్‌లో ప్రియాంకగాంధీ నామినేషన్

23-10-2024 02:31:14 AM

హాజరయ్యేందుకు కేరళ వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి 

హైదరాబాద్, అక్టోబర్ 22 (విజయక్రాం తి): కేరళలోని వయనాడ్ పార్లమెంట్ స్థానానికి జరిగే ఉపఎన్నికకు ఏఐసీసీ ప్రధాన కా ర్యదర్శి ప్రియాంకగాంధీ బుధవారం నామినేషన్ దాఖలు చేయనుండటంతో ఈ కార్య క్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మంగళవా రం కేరళకు వెళ్లారు.

ప్రియాంక నామినేషన్ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోని యాగాంధీ, రాహుల్‌గాంధీ, ఏఐసీసీ అధ్యక్షు డు మల్లికార్జున ఖర్గేతోపాటు కర్ణాటక సీఎం సిద్దరామయ్య, ఇతర సీనియర్లు హాజరుకానున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. వయనా డ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంకబరి లో దిగుతుండగా, బీజేపీ  నవ్య హరిదాస్‌ను రంగంలోకి దింపింది.

ఇక ఉపఎన్నికలో విజ యం సాధించి పూర్వవైభవం సాధించాలని ఎల్‌డీఎఫ్ కూడా ప్రచారాన్ని ముమ్మరం చేసింది. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ వయనాడ్‌తోపాటు యూపీలోని రాయ్ బరేలీ నుంచి పోటీచేసి రెండుచోట్ల విజయం సాధించారు. దీంతో రాయ్‌బరేలీ నుంచి ఎంపీగా కొనసాగాలని నిర్ణయం తీసుకొని, వయనాడ్ లోక్‌సభ సభ్యత్వానికి రిజైన్ చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.