న్యూఢిల్లీ: ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. వయనాడ్ ఎన్నికల ఫలితాల్లో ప్రియాంక గాంధీ వాద్రా దూసుకెళ్తున్నారు. ప్రియాంక వయనాడ్ ఉప ఎన్నికలో 83 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ప్రియాంక తొలి సారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగారు. గత ఎన్నికల్లో వయనాడ్ లో రాహుల్ గాంధీకి 3.64 లక్షల మోజార్టీ వచ్చింది. రాహుల్ గాంధీ రాజీనామాతో వయనాడ్ లో లోక్ సభకు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉదయం 10 గంటల సమయానికి ప్రియాంక గాంధీ వయనాడ్లో 1.2 లక్షల ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీకి చెందిన సత్యన్ మొకేరి దాదాపు 36,000 ఓట్లతో వెనుకబడి ఉండగా, బీజేపీకి చెందిన నవ్య హరిదాస్ 21,442 ఓట్లతో మూడో స్థానంలో ఉన్నారు. గత కొన్ని వారాలుగా, అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, గుజరాత్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మేఘాలయ, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ - 14 రాష్ట్రాల్లోని 48 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. కేరళలోని వాయనాడ్, మహారాష్ట్రలోని నాందేడ్ అనే రెండు లోక్సభ స్థానాలకు కూడా ఎన్నికలు జరిగాయి.