న్యూఢిల్లీ: కేరళలోని వయనాడ్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ రికార్డు నమోదు చేశారు. రాహుల్ గాంధీ మెజార్టీని ప్రియాంక గాంధీ బ్రేక్ చేశారు. వయనాడ్ ఉపఎన్నికలో ప్రియాంక ప్రస్తుతం 4.04 లక్షల ఓట్లు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో వయనాడ్ లో రాహుల్ గాంధీకి 3.64 లక్షల ఓట్ల మెజార్టీ వచ్చింది. ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన తొలిసారే ప్రియాంకగాంధీ ఘన విజయం సాధించారు.
గత కొన్ని వారాలుగా, అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మేఘాలయ, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ - 14 రాష్ట్రాల్లోని 48 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. కేరళలోని వాయనాడ్, మహారాష్ట్రలోని నాందేడ్ అనే రెండు లోక్‌సభ స్థానాలకు కూడా ఎన్నికలు జరిగాయి. రాహుల్ గాంధీ వాయనాడ్, రాయ్‌బరేలీ స్థానాలను గెలుచుకోవడం, రెండో స్థానాలను నిలబెట్టుకోవాలని నిర్ణయించుకోవడంతో వయనాడ్‌లో ఎన్నిక అనివార్యమైంది. రాహుల్ రాజీనామాతో వాయనాడ్ లో ప్రియాంక గాంధీ అరంగేట్రం చేశారు.