మహాదేవుని ఆలయంలో ప్రత్యేక పూజలు
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ గడికోట(Domakonda Gadi Kota Mahadev Temple)ను బాలీవుడ్ సినీనటి ప్రియాంక చోప్రా(Bollywood actress Priyanka Chopra) శుక్రవారం సందర్శించారు. దోమకొండ గడికోటలోని మహాదేవుని ఆలయంలో వేద పండితులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దోమకొండ గడికోట ఇంచార్జ్ బాబ్జి ఆధ్వర్యంలో ప్రియాంక చోప్రా(Priyanka Chopra)కు ఘన స్వాగతం పలికారు. దోమకొండ గడికోటలో కొలువుదీరిన మహాదేవుని ఆలయాన్ని బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా దర్శించుకున్నారు.
ఆమె ఆలయంలో సోమసూత్ర శివలింగానికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం హనుమాన్ ఆలయం(Hanuman Temple)లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గడికోటలోని అద్దాలమేడ తదితర ప్రాంతాలను సందర్శించారు. బాలీవుడ్ నటి మొదటి సారి దోమకొండకు రావడంతో ప్రజలు చర్చించుకున్నారు. గ్రామస్తులకు గడికోటలోకి అనుమతి ఇవ్వలేదు. పూజలు చేసిన బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా గడికోట లోని అందమైన ప్రదేశాలను చూసి మంత్రముగ్ధులయ్యారు. గడికోట సూపర్వైజర్ బాబ్జి గడికోట లోని విశేషాలను చరిత్రను వివరించారు.