calender_icon.png 24 October, 2024 | 8:45 AM

చాణక్య వర్మగా ప్రియదర్శి

02-08-2024 12:05:00 AM

నివేత థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘35 -చిన్న కథ కాదు’. నంద కిషోర్ ఈమాని దర్శకత్వంలో  క్లీన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రచారంలో ఓ ప్రత్యేక పంథాని అనుసరిస్తూ వస్తోంది చిత్ర బృందం. సినిమాలో నటించిన ప్రధాన పాత్రలకు సంబంధించి 35 సెకెన్ల వీడియోని విడుదల చేస్తూ ఆ పాత్రలను ప్రేక్షకులకు చేరువ చేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే నివేత, విశ్వదేవ్ పాత్రలను పరిచేయం చేసిన మేకర్స్ తాజాగా చాణక్య వర్మగా నటించిన ప్రియదర్శి పాత్ర వీడియోను విడుదల చేశారు.

మనిషి జీవితంలోకి చదువులొచ్చాక 35 మార్కులకు గల ప్రాధాన్యతపై దర్శకుడు రాసుకున్న ఈ కథలో ప్రియదర్శి లెక్కల మాస్టారుగా కనపడనున్నారు. తిరుపతి గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై  సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించారు. రానా సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15న తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల కానుంది.