ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్
హైదరాబాద్, ఆగస్టు 13 (విజయక్రాంతి): ఆర్టీసీ డిపోలను ప్రైవే ట్పరం చేస్తున్నారనే వదంతుల్లో వాస్తవం లేదని, యాజమాన్యం డిపోలను ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ బుధవారం ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. సంస్థ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా కొందరు దుష్ర్పచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఈవీ పాలసీ ప్రకారం పర్యావరణ హిత ఎలక్ట్రిక్ బస్సులను ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. ఎలక్ట్రిక్ బస్సుల తో సహా అన్ని బస్సుల ఆపరేషన్స్, నిర్వహణ డిపోల నుంచే జరుగుతాయని, వాటిపై పర్యవేక్షణ టీజీ ఆర్టీసీ ఆధ్వర్యంలోనే జరుగుతుందని తేల్చిచెప్పారు.