కేంద్ర మంత్రి కుమార స్వామి
హైదరాబాద్, జూలై 11 (విజయక్రాంతి) : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవే టీకరణ చేసే ప్రసక్తే లేదని కేంద్రమం త్రి హెచ్‌డీ కుమార స్వామి స్పష్టం చేశారు. గురువారం కేంద్ర ఉక్కు శాఖా సహాయ మంత్రి భూపతి రా జు శ్రీనివాస వర్మతో కలిసి స్టీల్ ప్లాం ట్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కుమార స్వామి మా ట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్‌ను 100 శా తం సామర్థ్యంతో పని చేసేలా చర్య లు తీసుకుంటామన్నారు. దీనిపై ప్ర ధానితో మాట్లాడి 2, 3 నెలల్లో నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుకు ఎలాంటి ఢోకా లేదని స్పష్టం చేశారు. ప్లాంట్ ఉద్యోగులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కేంద్రం అండగా ఉంటుందని భరోసా కల్పించారు.