ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కోరిన ప్రైవేట్ ఒకేషనల్ కళాశాల మేనేజ్మెంట్ అసోసియేషన్ సభ్యులు
జగిత్యాల,(విజయక్రాంతి): తెలంగాణ ప్రైవేట్ ఒకేషనల్ జూనియర్ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ సభ్యులు సోమవారం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కలిశారు. రాష్ట్రవ్యాప్తంగా వొకేషనల్ కళాశాల విద్యార్థులకు గత నాలుగెళ్ల నుండి స్కాలర్షిప్స్, ఎంటిఎఫ్, ఆర్టీఎఫ్ నిధులు గత ప్రభుత్వం విడుదల చేయలేదన్నారు. కళాశాలలో పని చేసే వారికి జీతభత్యాలు, కళాశాల భవన అద్దెలు, ఇతర ఖర్చులు చెల్లించడంలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని ప్రైవేట్ ఒకేషనల్ కాలేజీలను గత ప్రభుత్వo నిర్లక్ష్యం చేయడంతో కేవలం స్కాలర్షిప్ నిధులపై మాత్రమే ఆధారపడి నడిచే ప్రైవేట్ ఒకేషనల్ కాలేజీలకు మూడేళ్ళ బకాయలు విడుదల చేయకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో మేనేజ్మెంట్లు ఉన్నాయన్నారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని తెలంగాణ ప్రైవేట్ ఒకేషనల్ జూనియర్ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కోరారు.