26-04-2025 12:00:00 AM
వీబీఐటీ కళాశాల వద్ద ఉద్రిక్తత
మేడ్చల్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మండలం అవుషాపూర్ విజ్ఞాన భారతి ఇంజనీరింగ్(వీబీఐటీ)కళాశాల హాస్టల్ వార్డెన్ సెల్‌ఫోన్ లో విద్యార్థినుల ప్రైవేటు వీడియోలు, ఫొటోలు ఉండ టంతో శుక్రవారం విద్యార్థినులు ఆందోళనకు దిగారు. ఆందోళనతో కళాశాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. వీబీఐటీ కాలేజీలో బాలికల హాస్టల్ వార్డెన్‌గా రూప పనిచేస్తు న్నది.
ఆమె ఇటీవల విద్యార్థినుల ప్రైవేటు ఫొటోలు, వీడియోలు తీసి ఇతరులకు పంపిస్తున్నట్టు విద్యార్థినులు గుర్తించారు. అనుమానం వచ్చిన విద్యార్థినులు ఆమె ఫోన్ లాక్కుని చూడగా అందులో విద్యార్థినుల వీడి యోలు, ఫొటోలు కనిపించాయి. వాటిని బాయ్స్ హాస్ట ల్ చీఫ్ వార్డెన్ సత్యనారాయణకు పంపిస్తున్నట్లు గుర్తించిన విద్యార్థినులు ఆందోళనకు దిగారు.
కళాశా లలోని అన్ని తరగతుల విద్యార్థిని, విద్యార్థులు తరగతు లు బహిష్కరించి కళాశాల గేటు వద్దకు వచ్చి వార్డెన్ రూప, చీఫ్ వార్డెన్ సత్యనారాయణకు వ్యతిరేకంగా నినా దాలు చేశారు. వారిని సస్పెండ్ చేసి పోలీస్ కేసు నమో దు చేయాలని డిమాండ్ చేశారు. ఘట్‌కేసర్ పోలీసులు రంగ ప్రవేశం చేసి విద్యార్థులను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు.
వార్డెన్ రూప, చీఫ్ వార్డెన్ సత్యనారా యణలను సస్పెండ్ చేసేవరకు ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. విషయం కళాశాల యాజమాన్యం దృ ష్టికి తీసుకువెళ్లగా ఇద్దరు ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించడంతో ఆందో ళన విరమించారు. విద్యా ర్థినుల ప్రైవేటు వీడియో లు, ఫొటోలు తీయడం చట్టరీత్య నేరమని వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యా ప్తు జరుపుతామని పోలీ సులు తెలిపారు.