హైదరాబాద్: తిరుపతిలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ నిర్వాకంతో అలిపిరి లింక్ బస్టాండ్ వద్ద 35 మంది అయ్యప్ప భక్తులు ఇక్కట్లు పడుతున్నారు. తిరుమలలో దర్శనం ఆలస్యం కావడంతో డ్రైవర్ భక్తులను వదిలేసి వెళ్లిపోయాడు. శబరిమల వెళ్లి వస్తూ తిరుగు ప్రయాణంలో భక్తులు తిరుపతికి దర్శనానికి వెళ్లారు. దీంతో ట్రావెల్స్ బస్సు డ్రైవర్ భక్తుల బ్యాగ్ లను కిందపడేసి వెళ్లిపోయాడు.ట్రావెల్స్ బస్సు డైవర్ నిర్వకంపై అయ్యప్ప భక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నెల్లూరు టోల్ గేట్ వద్ద పోలీసులు నిలిపివేశారు. ట్రావెల్స్ యాజమాన్యంపై అలిపిరి పోలీస్ స్టేషన్ లో అయ్యప్ప భక్తులు ఫిర్యాదు చేశారు.