11-04-2025 01:07:13 AM
సూర్యాపేట, ఏప్రిల్10 (విజయక్రాంతి): తాను పని చేసిన సమయానికి వేతనం చెల్లించాలని చదువు చెప్పే పాఠశాల ముందు పిల్లలు చూస్తూ ఉండగా ఓ ఉపాధ్యాయుడు నిరసనకు దిగిన ఘటన గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్నది.
జిల్లా కేంద్రానికి చెందిన ఎస్‌ఎల్ కే స్కూల్ లో ఇంగ్లీస్ బొదిస్తున్న బాధితుడు పోలుమల్లకి చెందిన నల్ల ఆది రెడ్డి మాట్లాడుతూ జూన్ లో పాఠశాలలో చేరానని, అప్పటినుండి అడపాదడపగా జీతం ఇస్తుండగా కుటుంబం గడువక పోవడంతో మార్చి24 నుంచి మాని వేసినట్లు తెలిపారు. అయితే ఫిబ్రవరి,మార్చి 24 వరకు సుమారు 18వేలు జీతం రావా లని, యాజమాన్యం పట్టించుకోకపోవ డంతో నిరసన వ్యక్తం చేసినట్లు తెలిపారు.