calender_icon.png 13 March, 2025 | 4:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ భూమిలో ప్రెవేట్ ప్లాట్లు

13-03-2025 12:24:00 AM

దర్జాగా కబ్జాచేసి ప్లాట్లుగా మార్చి విక్రయాలు

పక్క ప్రైవేట్ సర్వే నంబర్ వేసి ప్రభుత్వ భూమిలో ప్లాట్లు..

పట్టించుకోని రెవెన్యూ అధికారులు

సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏం జరుగుతుంది...?

అబ్దుల్లాపూర్ మెట్, మార్చి: 12 ప్రభుత్వ భూములు కొల్లగొడుతుంటే అధికారులు మాత్రం తమకు పట్టన్నట్లు వ్యవహరిస్తున్నారు. ప్రైవేట్ వెంచర్ నిర్వాహకులు పక్క ప్రైవేట్ సర్వే నంబర్లు వేసి ప్రభుత్వ భూమిలో ప్లాట్లు వేసి అమ్మేసుకుంటున్న తమకు సంబంధం లేనట్లు రెవిన్యూ అధికారులు, ఎలాంటి డాక్యుమెంట్స్ పరిశీలించకుండా సబ్ రిజిస్టర్ రిజిస్టేషన్ చేయడంపై అధికారుల తీరుపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం సిటీ శివారు ప్రాంతం కావడం రేట్లు పెద్ద ఎత్తున పెరిగిపోవడంతో ఇక్కడ ఉన్న భూములకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. దీంతో అక్రమార్కుల కన్ను ప్రభుత్వ భూములపై పడింది. దీంతో మండల పరిధిలోని సుర్మాయి గూడ గ్రామ రెవెన్యూ పరిధిలోని 91సర్వే నెంబర్ లో ఉన్న ప్రభుత్వ భూమి ఉంది.

అయితే దీని పక్కనే ఇదే గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 52, 90, 92, 93, 94, 112, 113, 114లలో 2006లో గ్రామ పంచాయతీ లే అవుట్ చేశారు. ఈ లే అవుట్ లో 60ఫీట్ల రోడ్డు కూడా ప్రభుత్వ సర్వే నంబర్ 91లో  అమ్మేశారు. ఇదే లే అవుట్ అనుకుని 60 ఫీట్ల రోడ్డు కూడా ఉంది. ఈ లే అవుట్ చేసిన అతను మరచించిన... అనంతరం స్థానిక ఓ ప్రభుత్వ ఉద్యోగి సహాయంతో కొంత మంది అక్రమార్కులు ఆయన భార్యను తెరపైకి తీసుకువచ్చి... దీనికి ఆనుకునే 91సర్వే నంబర్ లో ప్రభుత్వం భూమి ఉంటుంది.

ఎవ్వరికి అనుమానం రాకుండా లే అవుట్ లో 91 సర్వే నెంబర్ వేసి ప్రభుత్వ భూమిలోకి వచ్చి లే అవుట్ ఎక్స్ టెండ్ చేశారు. ఇలా దాదాపు 3వేల గజలను ఇతరుల పేర్లమీద 2022 రిజిస్ట్రేషన్లు చేయించారు. గతంలో ఇక్కడ ఈ భూమి ప్రభుత్వ భూమి అని సూచిక బోర్డు కూడా ఉండేది. అక్రమార్కులు ఆ బోర్డును తొలగించి.. ప్రభుత్వ అధికారులుతో చేతులు కలిపి సర్కార్ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పనంగా అప్పజేప్పారు.

ఈ భూమి యొక్క మార్కెట్ విలువ దాదాపు రూ. 4 కోట్లు ఉంటుదని స్థానికులు తెలిపారు. ఇందులో ట్విస్ట్ ఏమిటంటే రిజిస్టర్ డాక్యుమెంట్స్ లో, లే అవుట్ లో ప్రభుత్వ సర్వే నంబర్ 91ఉన్నప్పటికీ ఆన్ లైన్ ఈసీ లో లేకుండా సబ్ రిజిస్టర్ రిజిస్టేషన్ చేస్తున్నాడు. విజయక్రాంతి ప్రతినిధి రెవెన్యూ అధికారులు వివరణ కోరగా... ఇవాళా, రేపు పొజిషన్‌కు వెళ్లి చూసి.. అదే విధంగా రికార్డులను పరిశీలించి కబ్జాకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటమంటూ కాలయాపన చేస్తున్నారు.