12-03-2025 05:57:20 PM
రేషన్ షాప్ లో ప్రైవేట్ సరుకుల దందా
ప్రభుత్వం నుంచే వచ్చేయంటు బలవంతంగా వినియోగదారులకు విక్రయం
సివిల్ సప్లై అధికారులకు సమాచారం ఇచ్చిన గ్రామస్తులు వెలుగులోకి వచ్చిన రేషన్ డీలర్ అదనపు ఆదాయం
ట్రెషన్ డీలర్ కుటుంబం కి మూడు అంత్యోదయ కార్డులు
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): కిరాణా సరుకులు కొంటేనే రేషన్ అందిస్తామని వినియోగదారులకు ఓవర్ రేషన్ షాప్ డీలర్ అల్టిమేట్ జారీ చేశారు. రేషన్ కావాలంటే నేను చెప్పిన సరుకులు కొనుగోలు చేస్తేనే మీకు రేషన్ అందుతుందని చెప్పడంతో చేసేదేం లేక రేషన్ షాప్ డీలర్ పరిధిలో ఉన్న సదరు వినియోగదారులు ఇతర నిత్యవసర సరుకులను కొనుగోలు చేస్తూ రేషన్ తీసుకుంటున్నారంటే రేషన్ డీలర్ దౌర్జన్యo ఎంత ఉందో ఒక్కసారి ఆలోచించండి. వివరాల్లోకి వెళితే జడ్చర్ల మండల పరిధిలోని నర్సూర్లబాద్ గ్రామంలో ఓ రేషన్ డీలర్ బహిరంగ మార్కెట్లో ఇతర సరుకులను సరుకులను తీసుకువచ్చి ఇవి కొనుగోలు కచ్చితంగా చేయాల్సిందని చెప్పడంతో వినియోగదారులు కొనుగోలు చేస్తూ వస్తున్నారు. ఈ విషయంపై గ్రామస్తులు సివిల్ సప్లై అధికారులకు సమాచారం ఇవ్వడంతో సంబంధిత అధికారులు తనిఖీలు చేపట్టడంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.
రేషన్ డీలర్ ఇంట్లో మూడు అంత్యదయ కార్డులు...
రేషన్ డీలర్ కు ఒక అంతే దయ కార్డుతో పాటు మరో ఇద్దరికి ఈ కార్డులు ఉన్నాయి. ఒక కార్డుకు 35 కేజీల చొప్పున 105 కిలోలు రేషన్ డీలర్ కుటుంబానికి వస్తున్నాయంటే నమ్మశక్యం కానీ విషయాలు వెలుగులోకి వచ్చాయి. సంబంధిత అధికారులు ఇన్నాళ్లు ఈ వ్యవహారం జరుగుతున్న వెలుగులోకి రావడంతో అనేక అనుమానాలకు తావిస్తుంది. దీంతోపాటు 12 క్వింటాళ్ల బియ్యం నిల్వ ఉండవలసి ఉండగా మరో 24 క్వింటాళ్ల బియ్యం అదనంగా ఉందని సంబంధిత అధికారుల తనిఖీల్లో బయటపడ్డాయి. రేషన్ షాప్ తనిఖీలలో డిటి వెంకటేశ్వర్ రెడ్డి, ఇన్ఫోస్ట్మెంట్ ఆదిత్య, జడ్చర్ల డిటి కిషోర్ కుమార్, ఆర్ఐ హర్షవర్ధన్, గ్రామస్తులు ఉన్నారు.