calender_icon.png 15 November, 2024 | 4:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి కార్మికుల పిల్లలను విద్య పేరిట దోచుకుంటున్న ప్రైవేట్ విద్యాసంస్థలు

10-11-2024 03:10:30 PM

పట్టించుకోని సింగరేణి సీ అండ్ ఎండి డైరెక్టర్

రామగిరి బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు మొలుమూరి శ్రీనివాస్

మంథని (విజయక్రాంతి): సింగరేణి కార్మికుల పిల్లలను విద్య పేరిట దోచుకుంటున్న వాణి ప్రైవేట్ విద్యాసంస్థ  పై చర్యలు తీసుకోవాలని రామగిరి బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు మొలుమూరి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన పాఠశాల ఆవరణలో మాట్లాడుతూ.. సింగరేణి కంపెనీ సౌజన్యంతో అర్జీ-3 ఏరియాలోనీ సెంటనరీ కాలనీలో భవన నిర్మాణంతో సహా 21 గదులు ఉన్న  ప్రవేట్ విద్యాసంస్థ యజమాన్యానికి లీజుకు ఇచ్చిందని, కార్మికుల పిల్లల తల్లిదండ్రుల దగ్గర, ప్రభావిత గ్రామాల పిల్లల తల్లిదండ్రుల దగ్గర తక్కువ ఫీజులు తీసుకోవాల్సి ఉండగా, విద్యా హక్కు చట్ట ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఫీజులో రాయితీలు ఇస్తూ ప్రభుత్వ నిబంధనలు పాటించాలని, కానీ గత 20 సంవత్సరాల నుండి నిబంధనలతో సింగరేణి యాజమాన్యం ప్రైవేటు సంస్థ అయినా వాణి విద్యాసంస్థకు లీజుకు ఇచ్చారని, కానీ ప్రైవేటు విద్యాసంస్థ కేవలం విద్యా వ్యాపార ధోరణితో అత్యధిక ఫీజులు సింగరేణి కార్మికుల పిల్లల దగ్గర వసూలు చేస్తున్న కూడా సింగరేణి సీ అండ్ ఎండి, డైరెక్టర్(పా) సింగరేణి అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.

ఈ ప్రైవేటు యాజమాన్యం నాణ్యమైన విద్యను అందించడం లేదని, పిల్లల నైపుణ్యం కోసం ఆటల పోటీలు, క్రీడలు నిర్వహించడం లేదని, మహిళా విద్యార్థులకు బాత్రూంలు కూడా సరిపడా లేవని అవేదన వ్యక్తం చేశారు. ప్రహరీ గోడ లేకపోవడంతో పశువులకు, పందులకు అడ్డాగా మారిందని, ప్రైవేట్ విద్యాసంస్థ నాయకుడు తన అధికార అండబలంతో అధికారులను భయపెట్టి తాను ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచి తీసుకుంటున్న ప్రభుత్వ అధికారులు, సింగరేణి అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా సింగరేణి అధికారులు కార్మికుల పిల్లల బంగారు భవిష్యత్తు గురించి ఆలోచన చేసి ఈ యొక్క స్కూల్ ను ప్రైవేటు విద్యాసంస్థల నుంచి సింగరేణి కంపెనీ తీసుకొని స్వయంగా వాళ్లే సీబీఎస్ ఈ సిలబస్ ఏర్పాటు చేయాలని బిజెపి పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. వెంటనే ఫీజుల నియంత్రణ కూడా చేయాలని లేని పక్షంలో సింగరేణి అర్జీ-3 జీఎం ఆఫీసును కార్మికుల పిల్లల కుటుంబాలతో కలిసి ముట్టడి చేస్తామని శ్రీనివాస్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో  టౌన్ అధ్యక్షుడు తీగల శ్రీధర్, సీనియర్ నాయకులు మెరుగు శ్రీకాంత్, నాగరాజు పాల్గొన్నారు