ఇల్లెందు, డిసెంబర్ 13: కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం రామచంద్రునిపేట గ్రామంలో ప్రైవేటు పత్తి కౌంటర్‌ను ఇల్లెందు మార్కెటింగ్ అధికారులు శుక్రవారం సీజ్ చేశారు. నవంబర్ 22న విజయ క్రాంతిలో “చిల్లర దోపిడీ షురూ” అనే వార్తా కథనానికి స్పందించిన అధికారులు తనిఖీలు చేపట్టారు. కౌంటర్‌లో పత్తి కొనుగోలు చేసి లారీలో లోడు చేస్తుండగా తనిఖీకి వచ్చిన అధికారులు ఎలాంటి లైసెన్సు లేక పోవడంతో లారీతో పాటు పత్తిని ఇల్లెందు మార్కెట్ గోదాముకు తరలించారు.