20-04-2025 11:03:33 AM
హైదరాబాద్: మెదక్ జిల్లా(Medak district) తుప్రాన్ లో ప్రైవేట్ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. జిల్లాలోని హల్దీ వాగు దాటిన తర్వాత బస్సు నుంచి ముందు చక్రాలు ఊడిపోయాయి(Private bus wheels ). ఒక్కసారిగా చక్రాలు ఊడిపోవడంతో బస్సు పక్కనున్న డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు బాధితులు తెలిపారు. బస్సు ప్రమాదంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని ట్రాఫిక్ నిమంత్రిస్తున్నారు.