calender_icon.png 9 March, 2025 | 9:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆగి ఉన్న ఐచర్ ను ఢీకొన్న ప్రైవేటు బస్సు

09-03-2025 08:36:29 AM

ఇద్దరు మృతి పలువురికి గాయాలు

ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. ఆదిలాబాద్ రూరల్ మండలం జందాపూర్ ఎక్స్ రోడ్ సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఆగి ఉన్న ఐచర్ వాహనాన్ని హైదరాబాదు నుండి నాగపూర్ వైపు వెళ్తున్న ప్రైవేటు బస్సు ఢీకొంది. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం. ప్రమాదానికి సబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.