calender_icon.png 11 March, 2025 | 2:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆగి ఉన్న ఐచర్‌ను ఢీకొన్న ప్రైవేట్ బస్సు

10-03-2025 12:07:36 AM

ఇద్దరు మృతి, పలువురికి గాయాలు

ఆదిలాబాద్, మార్చి 9 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాదు నుండి జబల్ పూర్ వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఆదిలాబాద్ రూరల్ మండలం జందాపూర్ ఎక్స్ రోడ్ సమీపంలోని జాతీయ రహదారి పై ఆదివారం తెల్లవారుజామున ఆగి ఉన్న ఐచర్ వాహనాన్ని ఢీకొంది.

ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు ప్రదీప్ సాహు, లోచన్ సాహు లు అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సులో ప్రయాణిస్తున్న 10 మందికి గాయాలయ్యాయి. వెంటనే గాయపడ్డ వారిని 108 అంబులెన్స్ లో ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న ఎస్పీ గౌష్ అలం ప్రమాద స్థలాన్ని పరిశీలించారు.

తెల్లవారుజామునే ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. దగ్గరుండి ప్రమాద వాహనాలను నేషనల్ హైవే సిబ్బంది, పోలీస్ సిబ్బందితో కలిసి రోడ్డు పై నుండి తొలగించి ట్రాఫిక్ ను క్రమబద్దీకరించారు.      ఎస్పీ వెంట డీఎస్పీ జీవన్ రెడ్డి, సీఐ లు, ఎస్‌ఐ లు ఉన్నారు.