calender_icon.png 22 December, 2024 | 8:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జయేద్ మసూద్‌గా పృథ్వీరాజ్

17-10-2024 12:00:00 AM

2019లో ‘లూసిఫర్’ చిత్రం విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రానికి సీక్వెల్ ‘లూసిఫర్ 2 : ఎంపురాన్’కు పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించడమే కాకుండా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ సుభాస్కరన్, ఆశీర్వాద్ సినిమాస్ ఆంటోని పెరుంబవూర్ సమర్పణలో లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్ కథానాయకుడిగా ఈ చిత్రం తెరకెక్కనుంది. తొలి భాగం మంచి విజయం సాధించడంతో సీక్వెల్‌పై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా చిత్రాన్ని మేకర్స్ రూపొందిస్తున్నారు. ఇది మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమార్ కాంబినేషన్‌లో రానున్న మూడో చిత్రం కావడం కూడా గమనార్హం.

మోహన్ లాల్ పుట్టిన రోజు సందర్భంగా ‘ఎల్ ఎంపురాన్’ నుంచి ఆయన లుక్‌ను విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. తాజాగా పృథ్వీరాజ్ సుకుమారన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో ఖురేషి అబ్రహంకు రైట్ హ్యాండ్‌లా ఉండే జయేద్ మసూద్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించనున్నారు. తాజాగా విడుదలైన జయేద్ మసూద్ పాత్ర ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది.