కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి సబ్ జైల్ ను రాష్ట్ర జైళ్ళ శాఖ డిజీ సౌమ్య మిశ్రా వరంగల్ రేంజ్ డిఐజి సంపత్ సోమవారం తనిఖీ చేశారు. సబ్ జైలులో ఉన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. జైలులో ఖైదీల భోజన వసతులు, న్యాయ సేవలు, ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జైల్లో గార్డెన్ నిర్వహణ తీరుపై అధికారులను అభినందించారు. అనంతరం సబ్ జైల్లో రికార్డులను తనిఖీ చేశారు. వారితో పాటు జిల్లా ఎస్పీ సింధు శర్మ, ఏఎస్పీ చైతన్య రెడ్డి, సబ్ జైలు అధికారి ఆనందరావు, పర్యవేక్షణ అధికారి సంజీవరెడ్డి పాల్గొన్నారు.