calender_icon.png 18 January, 2025 | 6:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు 213 మంది ఖైదీల విడుదల

03-07-2024 12:02:06 AM

సత్ప్రవర్తన కారణంగా విడుదల చేయాలని ప్రభుత్వ నిర్ణయం

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 2 (విజయక్రాంతి) : సత్ప్రవర్తన కారణంగా నేడు 213 మంది ఖైదీలను ముందస్తుగా విడుదల చేయనున్నా రు జైలు అధికారులు. దీర్ఘకాలంగా జైళ్లలో మగ్గుతున్న తమ కుటుంబసభ్యులను విడుదల చేయాలంటూ ఖైదీల కుటుంబసభ్యులు సీఎం రేవంత్‌రెడ్డికి ప్రజాపాలనలో దరఖాస్తులు అందజేశారు. దీనిపై స్పందించిన సీఎం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల ఆధారంగా ఖైదీల ముందస్తు విడుదలకు ఉన్న అవకాశాను పరిశీలించాలని జైలు అధికా రులను ఆదేశించారు. దరఖాస్తులను పరిశీలించిన సీనియర్ అధికారులు, అర్హులైన వారి వివరాలను హైలెవల్ కమిటీకి పంపించారు.

హైలెవల్ కమిటీ అర్హులైన ఖైదీల జాబితాను క్యాబినెట్ ఆమోదం కోసం పంపించింది. సీఎం రేవంత్ నేతృత్వంలోని క్యాబినెట్ ఖైదీల విడుదలకు అమోదముద్ర వేసింది. అనంతరం ఆ జాబి తాకు గవర్నర్ ఆమోద ముద్ర వేయడంతో ఖైదీల ముందస్తు విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం, చర్లపల్లి జైలు నుంచి 213 మంది ఖైదీలు నేడు విడుదల కానున్నారు. వీరిలో 205 మంది యావజ్జీ వ శిక్ష పడిన వారు, 8 మంది తక్కువ కాలం శిక్షపడిన వారు ఉన్నారు.