calender_icon.png 29 April, 2025 | 2:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖైదీలు ఉచిత న్యాయ సహాయం పొందండి

25-04-2025 02:37:08 AM

న్యాయమూర్తి నసీం సుల్తానా

నాగర్ కర్నూల్ ఏప్రిల్ 24 (విజయక్రాంతి): క్షణికావేషంలో తెలిసి తెలియక చేసి న తప్పులకు జైలు జీవితం అనుభవిస్తున్న ఖైదీలకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఉచితంగా న్యాయ సేవలను అందించనుందని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి నసీం సుల్తానా తెలిపారు. గురువారం జిల్లా సబ్ జైలును ఆమె ఆకస్మికంగా సందర్శించారు.

జైల్లో ఖైదీలకు,  కల్పిస్తున్న సౌకర్యాలు, తినే ఆహార పదార్థాలను, వంటగదిని, వాష్ రూమ్ లను పరిశీలించి వారి కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నా రు. ఎవరికైనా న్యాయసహాయం కావలిస్తే న్యాయ సేవాధికార సంస్థ తరపున ఉచితం గా న్యాయ సహాయం అందించి అడ్వకేట్ ను నియమిస్తామన్నారు.

వారితో పాటు డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అడ్వకేట్ శ్రీరామ్ ఆర్య, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అడ్వకేట్ పవన్ శేషు సాయి,  సబ్ జైల్ సూపరింటెండెంట్ పాల్గొన్నారు.