28-03-2025 12:31:25 AM
పటాన్‌చెరు, మార్చి 27 :మద్యం తాగి వాహనం నడిపిన వారికి జిల్లా కోర్టు జైలు శిక్ష, జరిమానాలు విధించింది. పటాన్ చెరు పట్టణ పరిధిలో మద్యం తాగి వాహనం నడిపిన పదిహేను మందిని గురువారం సంగారెడ్డి జిల్లా కోర్టుకు హాజరుపరుచగా ఆరుగురికి రూ.2వేలు చొప్పున, మరో ఆరుగురికి రూ.1500చొప్పున, ఇద్దరికి రూ. వెయ్యి చొప్పున, ఒకరికి రెండు రోజుల జైలు శిక్ష కోర్టు విధించిందని ట్రాఫిక్ సీఐ లాలు నాయక్ తెలిపారు.
అలాగే గుమ్మడిదల పరిధిలో మద్యం తాగి వాహనాలు నడిపిన ముగ్గురిని కోర్టకు హాజరుపరుచగా ఒకరికి నాలుగు రోజుల జైలు శిక్ష, ఇద్దరికి రూ. 2500 చొప్పున జరిమానాను కోర్టు విధించిందని ఎస్‌ఐ మహేశ్వర్ రెడ్డి తెలిపారు.