భూబకాసురుల చెరలో గొలుసు కట్టు చెరువులు
శిఖం భూముల్లో అక్రమ నిర్మాణాలు
వంద ఎకరాల భూ రికార్డులు మాయం
హైకోర్టు జోక్యం చేసుకున్నా మారని తీరు
నిర్మల్, సెప్టెంబర్ ౧౦ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో నిజాం కాలంలో నవాబులు నిర్మించిన గొలుసుకట్టు చెరువులు ప్రజలకు తాగు, సాగునీరు అం దించాయి. ఇప్పుడు భూభకాసురుల చేతిలో మాయమై పోతున్నాయి. రాష్ట్రమ ంతా నీటి కరువు వచ్చినా నిర్మల్ లో భూగర్భ జలాలకు కొ రత ఏర్పడలేదు. దీనికి కారణ మ ఈ గొలుసుకట్టు చెరువులే. ని జాం నవాబులు నిర్మల్ పట్టణం చు ట్టూ నిర్మించిన 11 గొలుసు కట్టు చెరువులు ఆక్రమణలకు గురవుతున్నాయి. చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి.
నిర్మల్‌లోని 11 చెరువులు ఇవే..
నిర్మల్ పట్టణం చుట్టూ నిజాం కాలంలో 11 గొలుపు కట్టు చెరువులను నిర్మించా రు. ఒక చెరువు నిండిన త ర్వాత అలుగు కాలువ ద్వా రా మరో చెరువుకు నీటిని మళ్లించే విధంగా నిర్మించా రు. బంగల్‌పేట, కురన్నపేట్, వెంకటాద్రిపేట్, గొల్లపేట్, ఇబ్రహీంకుంట, కంచరోడి చెరువు, సోపినగర్ చెరువు లు ఒకవైపు ఉన్నాయి. మరోవైపు పల్లె చె రువు, గాజులపేట్, మంజులాపూర్, ధర్మసాగర్ చెరువులు ఉన్నాయి. వీటిలో అన్నింటి కంటే పెద్దది బంగల్‌పేట్ చెరువు. ఇది నిండితే మిగిలిన చెరువులన్నీ నిండినట్టే.
పాగా వేస్తున్న రియల్టర్లు
నిర్మల్ పట్టణం జిల్లా కేంద్రంగా మారడ ం, వ్యాపార, వాణిజ్య, విద్య వనరులకు నిలయమవడంతో భూముల ధరలకు రెక్కలొ చ్చాయి. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగతున్నది. ఈ నేపథ్యంలో కొం దరు రియల్టర్లు, ప్రజాప్రతినిధులు చెరువు భూములపై కన్నేశారు. అధికారులను మచ్చి క చేసుకుని, రాజకీయ పలుకుబడితో పాత రికార్డులను తిరుగరాస్తు, చెరువుల సరిహద్దులను చెరిపి శిఖం భూమలు కబ్జా చేస్తున్నా రు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లలో వందల స ంఖ్యలో అక్రమ నిర్మాణాలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు పుట్టుకొస్తున్నాయి. అయినా కూడా అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఫిర్యాదులు వస్తే తప్ప వాటి జో లికి వెళ్లడం లేదు. చెరువుల పరిరక్షణకు జి ల్లా కలెక్టర్ గతంలో కమిటీ వేస్తామని చెప్పి నా కార్యరూపం దాల్చలేదు.
అమలుకాని హైకోర్టు తీర్పు
నిర్మల్ చెరువుల్లో ఆక్రమణలపై గతంలో హైకోర్టులో పిటిషన్ వేయగా కోర్టు తీవ్రంగా పరిగణించింది. ఆక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని ఆదేశించింది. కొన్నింటిని మత్రమే అధికారులు కూల్చివేసి చేతులు దులుపుకున్నారు. అప్పటి కలెక్టర్ చెరువుల ఆక్రమణలపై రెవెన్యూ, నీటిపారుల శాఖ, భూ రికార్డు అధికారులతో ఉమ్మడి సర్వే నిర్వహించారు. ఆక్రమణలు గుర్తించి తొలగించాలని ఆదేశించినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
ముంపునకు గురవుతున్న కాలనీలు
గొలుసుకట్టు చెరువులు ఆక్రమణకు గురవడంతో వరద నీరు కాలనీల్లోకి వచ్చి చేరుతున్నది. నిర్మల్‌లోని ప్రియదర్శిని నగర్, విజయనగర్, గొల్లపేట్, శా్రస్త్రీనగర్, దివ్యనగర్, గాజులపేట్, ఇందిరనగర్, బో యవాడ, ఈదిగాం కాలనీలు వానాకాల ంలో ముంపునకు గురవుతున్నాయి. అధికారులు అప్పటికప్పుడు తాత్కాలిక చర్యలు తీసుకుంటున్నారు తప్పితే చెరువుల ఆక్రమణలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
తగ్గిన చెరువుల విస్తీర్ణం
బంగల్‌పేట్ చెరువుకు 210.32 ఎకరాల శిఖం భూమి ఉంది. ఖాజనా చెరువుకు 98.10 ఎకరాలు, కురన్నపేట్‌కు 76.18, గొల్లపేట్‌కు 48.18, ఇబ్రహీకుంటకు 76.18, కంచరోడి కట్టకు 74.19, ధర్మసాగర్‌కు 65.10, మోతితలాబ్‌కు 132.06, మంజులాపూర్‌కు 81.34, నట్రాజ్ నగర్‌కు 34.18 ఎకరాల శిఖం భూములున్నాయి. మిగిలిన చిన్న కుంటలకు 20 ఎకరాల నుంచి 30 ఎకరాల వరకు శిఖం ఉన్నట్టు అధికారులు తెలిపారు. కురన్నపేట్ చెరువు భూములు మూడెకరాలు, మంజులపూర్ భూములు నాలుగు ఎకరాలు, పల్లె చెరువు భూములు నాలుగు ఎకరాలు, కంచరోడి కట్ట భూములు నాలుగు ఎకరాలు, ధర్మసాగర్ భూములు రెండెకరాలు, గొల్లపేట్ భూములు మూడు ఎకరాలు, మోతి తలాబ్ భూములు మూడు ఎకరాల వరకు మాయమయ్యాయి.
ఫిర్యాదులపై స్పందిస్తున్నాం
నిర్మల్ పట్టణంలో గొలుసు కట్టు చెరువుల ఆక్రమణలపై చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. వాటిపై తక్షణం స్పందిస్తున్నాం. చెరువు భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేసినా కూల్చివేస్తాం. నిర్మల్ పట్టణంలో గొలుసు కట్టు చెరువుల ఆక్రమణలను గుర్తించేందుకు రెవెన్యూ, నీటిపారుదల, భూ రికార్డు సర్వే, మున్సిపల్ అధికారులతో కమిటీ వేసి చర్యలు ప్రారంభించాం. డిజిటల్ సర్వే చేసి చెరువుల సరిహద్దులను ఏర్పాటు చేస్తాం. చెరువుల శిఖం చుట్టూ కంచెలు ఏర్పాటు చేస్తాం.
కిశోర్‌కుమార్,
అదనపు కలెక్టర్, నిర్మల్