calender_icon.png 11 March, 2025 | 11:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎవరు అవకాశమిస్తే వారికే ప్రాధాన్యం

05-03-2025 12:00:00 AM

బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ పలకరించడం తో హీరోయిన్ పూజా హెగ్డే కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయింది. తిరిగి ప్రస్తుతం మరోసారి బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. బాలీవుడ్‌లో కెరీర్ ప్రారంభించిన పూజా హెగ్డే సౌత్‌లో టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. ఆ తరువాత బాలీవుడ్‌లో నూ సినిమాలు చేసింది. తాజాగా ‘దేవా’ చిత్రం కూడా అమ్మడికి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ప్రస్తుతం పూజా హెగ్డేకు మరోసారి సౌత్ అవకాశమిచ్చింది.

తమిళనాట అమ్మడు యమా బిజీ. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో సౌత్, నార్త్ సినీ ఇండస్ట్రీలో ఏది ప్రాధాన్యత అనే విషయమై అమ్మడు ఆసక్తికర కామెంట్స్ చేసింది. తనకు ఎక్కడ ఎవరు అవకాశం ఇస్తే వారికే ప్రాధాన్యత అని చెప్పింది. “నాకు అవకాశం కల్పించేది సౌతా? నార్తా? అనేది చూడను. అసలు ఆ డిఫరెన్సే నాకు లేదు. ఎవరు అవకాశాలు ఇచ్చి, ఆదరిస్తారో వారే ముఖ్యం.

అవకాశాలు తక్కువగా ఉన్న సమయంలోనే నేను కష్టపడి నా కెరీర్‌ను నిర్మించుకున్నా. ఇదొక గొప్ప ప్రయాణం. ప్రతి సినిమా మనల్ని ఎదిగేలా చేస్తుంది కాబట్టి అవన్నీ నాకు ముఖ్యమే. ఆ సినిమాలే మనం ఎదుగుదలకు లేదంటే నాశనానికి కారణమవుతా యి. అవకాశాలు రావాలంటే సక్సెస్ ఉండాల్సిందే. బాలీవుడ్ సినిమాలు చూస్తూ పెరిగిన నాకు.. సౌత్ మూవీస్ బాలీవుడ్‌లో అదరగొట్టడం చూస్తుంటే ఆశ్చర్యమేసింది” అని పూజాహెగ్డే చెప్పుకొచ్చింది.