calender_icon.png 27 December, 2024 | 11:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదప్రజల సంక్షేమానికి ప్రాధాన్యం

04-12-2024 01:32:20 AM

కామారెడ్డి, డిసెంబర్ 3 (విజయక్రాంతి): -పేద ప్రజల సంక్షేమానికి రాష్ట్రప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నదని రాష్ట్ర అగ్రో కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాల్‌రాజ్ అన్నారు. మంగళవారం ఆయన బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన ప్రజా పరిపాలన విజయోత్సవాల్లో పాల్గొన్నారు. తొలుత మున్సిపల్ కార్యాలయం నుంచి తాడ్కోల్ చౌరస్తా వరకు మహిళలు, ప్రజాప్రతినిధులు ర్యాలీలో పాల్గొన్నారు.

అనంతరం కాసుల బాలరాజు మాట్లాడుతూ.. పరిసరాలను ప్రజలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖలేఖ్, అసద్‌బిన్, మోసీన్, ఎజాస్, నార్ల సూరి, లింగమేశ్వర్, ఆలీమోద్దీన్, బాబా, వాహబ్, చిన్న, గుడాల, నగేశ్, అఫ్రోజ్ పాల్గొన్నారు.