calender_icon.png 25 April, 2025 | 2:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యం

25-04-2025 01:03:21 AM

వారి అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు 

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భారతి నగర్, రామచంద్రాపురం డివిజన్ల పరిధిలో రూ. 1. 45 కోట్ల అభివృద్ధి  పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు

పటాన్ చెరు/రామచంద్రాపురం, ఏప్రిల్ 24 :ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు.  ప్రజల అవసరాలకు అనుగుణంగా నిధులు కేటాయిస్తూ అభివృద్ధి పనులు చేపడుతున్నా మని అన్నారు.  గురువారం భారతీ నగర్ డివిజన్ పరిధిలోని మ్యాక్ సొసైటీలో రూ.44 లక్షతో చేపట్టనున్న పార్క్ ప్రహరీ గోడ నిర్మాణ పనులు, ఎల్‌ఐజీ కాలనీలో రూ.23 లక్షలతో పా ర్కు పునరుద్ధరణ పనులు, హెచ్‌ఐజీ కాలనీలో రూ.28 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్ల పునరుద్ధరణ పనులు, రామచంద్రాపురం డివిజన్ పరిధిలో శ్రీనివాస నగర్ కాలనీలోని బాలవిహార్ పార్క్ లో రూ. 50 లక్షలతో చేపట్టనున్న ప్రహరీ గోడ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమాలలో స్థానిక కా ర్పొరేటర్లు సింధు ఆదర్శ్ రెడ్డి, పుష్ప నగేష్, మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య యాదవ్,  సీనియర్ నాయకులు పర మేష్ యాదవ్, ఐలేష్ యాదవ్, జీహెచ్‌ఎంసీ అధికారులు, ఆయా కాలనీల అసోసియేషన్ అధ్యక్షులు, పాల్గొన్నారు.

ఆలయ వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే 

తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ఘనపూర్ లో గురువారం సాయిబాబ ఆలయ వార్షికోత్సవం ఘనంగా నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరు దైవ భక్తిని అలవరచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శ్రీశైలంయాదవ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్కుమార్, నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, ఆలయ ధర్మకర్త బాసిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ నీనా చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.