calender_icon.png 12 January, 2025 | 3:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గీత కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం

12-10-2024 01:54:16 AM

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం 

కాటమయ్య కిట్ల పంపిణీ

నల్లగొండ, అక్టోబర్ 11 (విజయక్రాంతి): కల్లు గీత కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నదని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నకిరేల్ పట్టణంలో శుక్రవారం మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డితో కలిసి గీత కార్మికులకు కాటమయ్య రక్ష కిట్లను పంపిణీ చేసి మాట్లాడారు.

కల్లు గీత కార్మికులు చెట్టు ఎక్కుతుండగా ప్రమాదాల బారినపడకుండా ప్రభుత్వం వీటిని పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో తొలి విడుత 208 మందికి పంపిణీ చేయనున్నట్లు వేముల వీరేశం తెలిపారు.