calender_icon.png 9 March, 2025 | 6:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు ప్రాధాన్యం

09-03-2025 12:42:02 AM

ఉమ్మడి ఏపీ కంటే ఆరు రెట్లు అధికంగా కేటాయింపులు

  1. కేంద్ర రైల్వే, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ 
  2. సెమీకండక్టర్స్ పరిశ్రమల ఏర్పాటుకు సహకరించాలి: మంత్రి శ్రీధర్‌బాబు 
  3. దివిటిపల్లిలో అమరరాజా గిగా ఫ్యాక్టరీ-1కు శంకుస్థాపన

మహబూబ్‌నగర్, మార్చి 8 (విజయక్రాంతి): రైల్వేబడ్జెట్ కేటాయింపుల్లో  కేంద్రం తెలంగాణకు ప్రాధాన్యం ఇస్తున్నదని, ఆ కేటాయింపులు ఉమ్మడి ఏపీలో కేటాయింపులకంటే ఆరు రెట్లు అధికమని కేంద్ర రైల్వే, సమాచార, ప్రసార, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు.

మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రం శివారులోని దివిటి పల్లిలో రూ.3,225 కోట్ల పెట్టుబడులతో నిర్మించనున్న అమరరాజా గిగా ప్యాక్టరీ-1 అల్టిమిన్ ప్రైవెట్ లిమిటెడ్ ప్లాంట్ పనులకు శనివారం ఆయన రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి శంకుస్థా పన చేసి మాట్లాడారు.

ఉమ్మడి ఏపీలో రైల్వేబడ్జెట్ కేటాయింపులు రూ.886 కోట్లు ఉం డేవని, కానీ.. కేంద్రం ఇప్పుడు తెలంగాణకు రూ.5,337 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నదని వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్టీల్, కెమికల్స్, బ్యాటరీ సెల్ టెక్నాలజీపై విస్తృతంగా పరిశోధనలు జరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.

ఫ్యాక్ట రీ ఏర్పాటుతో దివిటిపల్లిలో అభివృద్ధికి మా ర్గం సుగమం అవుతుందన్నారు. అమరరాజా ఫ్యాక్టరీలో 80 శాతం మంది మహిళా ఉద్యోగులే ఉండడం అభినందనీయమన్నా రు. ప్రధాని మోదీ పాలనలో దేశవ్యాప్తంగా 14 కోట్ల కుటుంబాలకు గ్యాస్ సిలిండర్లు అందాయని తెలిపారు. ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నదని వెల్లడించారు. దేశవ్యా ప్తంగా 54 కోట్ల బ్యాంక్ ఖాతాలు తెరవగా, వాటిలో సగానికి పైగా మహిళల పేరునే ఉన్నాయని పేర్కొన్నారు.

కార్యక్రమంలో ఎం పీ డీకే అరుణ,  రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయల సంస్థ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, టీజీఐఐసీవీసీ అండ్ ఎండీ విష్ణువర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మూడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, పరిశ్రమల శాఖ జీఎం ప్రతాప్‌రెడ్డి, అమరరాజ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్, ఎండీ గల్లా జయదేవ్ పాల్గొన్నారు.

పారిశ్రామిక వేత్తలకు తోడ్పాటు: మంత్రి శ్రీధర్‌బాబు 

రాష్ట్రప్రభుత్వం పారిశ్రామిక వేత్తలకు అన్ని విధాలా తోడ్పాటు అందిస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌భాబు అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో తమ ప్రభుత్వం  విరివిగా పెట్టుబడులను ఆహ్వానిస్తున్నదని తెలిపారు. ఇతర రాష్ట్రాలకు దీటుగా తెలంగా ణ ఎదుగుతు ందన్నారు.

సెమీ కండక్టర్స్ పరిశ్రమల ఏర్పా టు, అభివృద్ధికి తమ ప్రభుత్వం అనుకూలం గా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ రాష్ట్రం లో సెమీ కండ క్ట్స్ పరిశ్రమల అభివృద్ధికి సహకారించాలని విజ్ఞప్తి చేశారు.  దివిటిపల్లిలో ఎలక్ట్రానిక్ మా న్యుపాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ) కోసం భూ ములిచ్చిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు.