12-03-2025 12:00:00 AM
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
ఉప్పల్ సర్కిల్‌లో రూ.41.19 కోట్ల పనులకు శంకుస్థాపన
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 11 (విజయక్రాంతి): మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. మంగళవారం ఉప్పల్‌లో రూ.41.19 లక్షల అభి పనులకు జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్సీ పట్నం మ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్‌రెడ్డిలతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఉప్పల్ సర్కిల్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ఉప్పల్‌ెేఘట్‌కేసర్ మధ్య కొత్తగా ఐటీకారిడార్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. సాంకేతిక సమస్యలను అధిగమించి ఉప్పల్ ఫైఓవర్‌ను త్వరగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
వేసవి సందర్భంగా నగరంలో మంచినీటి కొరత ఏర్పడకుండా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశామని మంత్రి తెలిపారు. ఢిల్లీలోని పరిస్థితి హైదరాబాద్‌కు రాకుండా కాలుష్య నివారణకు దశల వారీ అన్ని ఆర్టీసీ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మారుస్తున్నట్లు పేర్కొన్నారు. పేదలకు ఇబ్బందులు కలుగకుండా వారికి నష్టం కలుగకుండా మూసీ ప్రక్షాళన చేపడుతామని చెప్పారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తామని, మెట్రోను విస్తరింపజేస్తామని పేర్కాన్నారు.
హుందాగా అసెంబ్లీ సమావేశాలు
అసెంబ్లీ సమావేశాలను హుందాగా నడిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మం శ్రీధర్‌బాబు తెలిపారు. అసెంబ్లీకి రండి రాష్ట్రాభివృద్ధికి విలువైన సూచనలివ్వండని, తాము వాటిని మనస్ఫూర్తిగా స్వీకరిస్తామన్నారు. రాష్ట్రాభివృద్ధిలో కలిసి వచ్చే వారిని మేం కలుపుకపోతామని, ఎలాంటి భేషిజాలు లేవని చెప్పారు. కేటీఆర్ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని, ఏదో బట్ట కాల్చి తమపై వేయడం వివేకం అనిపించుకోదన్నారు.
టీడీఆర్ విషయంలో తమపై లేని నిందలు వేసి దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయంలో అక్ర జరిగిందే బీఆర్‌ఎస్ హయాంలోనన్నారు. కార్యక్రమంలో మేడ్చల్ కలెక్టర్ గౌతం పొత్రు, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్‌పాటిల్, స్థానిక కార్పొరేటర్లు రజిత, బండారు శ్రీవాణి, బొంతు శ్రీదేవి పాల్గొన్నారు.