calender_icon.png 14 March, 2025 | 4:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ విద్యకు ప్రాధాన్యం

12-03-2025 01:30:14 AM

నిర్మల్, మార్చి 11 (విజయక్రాంతి) ః దేశంలో వ్యవసాయం తర్వాత విద్యకు కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తూ కేంద్ర నిధులను ఖర్చు చేస్తుందని నిర్మల్ ఎమ్మెల్యే బీజేఎల్పి నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. సోను మండల కేంద్రంలో 4.19 కోట్లతో నిర్మించిన కస్తూరిబా పాఠశాలను నాలుగు లక్షలతో నిర్మించి ప్రహరీ గోడ పనులను శంకుస్థాపన చేసి ప్రారంభించారు.

పెద్ద పిల్లలను చదివించాలని లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ నిధులతో కస్తూరి పాఠశాలలు నిర్వహించబడుతున్నాయని గుర్తు చేశారు. బాలికలు చదువులో రాణించాలని వారికి అన్ని విధాల ప్రోత్సవం అందిస్తామన్నారు. అనంతరం 28 మందికి షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి పంచాయతీరాజ్ తుకారం మాజీ ఎంపీపీ మానస రమేష్ బిజెపి మండల పార్టీ అధ్యక్షులు మార గంగారెడ్డి పార్టీ నాయకులు గంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు కేజీబీవీ పాఠశాల జిల్లా అధికారి సలోమీకరణ ఎస్‌ఓ లలితా దేవి అధికారులు పాల్గొన్నారు.