04-04-2025 01:33:55 AM
మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
మిర్యాలగూడ, ఏప్రిల్ 3: రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నదని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. మిర్యాలగూడ మండలం అవంతిపురం మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన ప్రారం భించారు. అనంతరం రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.
ధాన్యం విక్రయానికి రైతులకు ఇబ్బంది లేకుండా ఐకేసీ కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. రైతులు పండించిన సన్నధాన్యానికి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు క్వింటాకు రూ.500 బోనస్ సైతం అందిస్తున్నదని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతుల ప్రభుత్వమని, దేశంలో రూ.2 లక్షలలోపు వ్యవసాయ రుణాలు తెలంగాణ సర్కారు మాఫీ చేసి చూపిందన్నారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ అధికారులు, కాంగ్రెస్ మండల నాయకులు పాల్గొన్నారు.