calender_icon.png 16 January, 2025 | 12:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్య, వైద్యానికి ప్రాధాన్యం

07-12-2024 01:26:19 AM

  • మంత్రి దామోదర రాజనర్సింహ

కొడంగల్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

వికారాబాద్, డిసెంబర్ 6 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శుక్రవారం రాష్ట్ర మంత్రు లు.. దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావుతో కలిసి ఆయన కొడంగల్ నియోజ కవర్గంలో రూ.76 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.

ఈ సందర్బంగా హరేకృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న అల్పాహార వంటశాలను వారు ప్రారంభించారు. కొడంగల్ నియోజకవర్గంలోని ప్రభు త్వ పాఠశాలల్లో చదువుతున్న 28వేల మంది విద్యార్థులకు ఈ వంటశాల నుండి ప్రతిరోజు అల్పాహారం అందించనున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్ రెడ్డి, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత, పరిగి ఎమ్మెల్యే టీఆర్‌ఆర్ పాల్గొన్నారు.