- 90రోజుల స్పెషల్ డ్రైవ్‌తో సత్ఫలితాలు
- జలమండలి వార్షిక నివేదికలో వెల్లడి
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 2౯(విజయక్రాంతి): గ్రేటర్‌సహా ఓఆర్‌ఆర్ వరకు గల ప్రజలకు తాగునీటి సరఫరా, మురుగు శుద్ధి నిర్వహణలో ఈ యేడాది మరిం మెరుగైన సేవలు అందించామని జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి, ఈడీ మయాంక్ మిట్టల్ తెలిపారు.
ఈ మేరకు సంవత్సరకాలంలో జలమండలి సాధించిన లక్ష్యాలను వార్షిక నివేదికలో వివరాలు వెల్లడించారు. రాష్ర్ట ప్రభుత్వం గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లు ఫేజ్- పచ్చజెండా ఊపింది. ఈ పథకం ద్వారా నగర ప్రజల తాగునీటి అవసరాల కోసం అదనపు జలాలను తరలించ పాటు.. హిమాయత్ సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాశయాల పునరుజ్జీవన పనులు చేపట్టనుంది.
నగరంలో ఉత్పన్నమయ్యే మురుగు నీటిని 100 శాతం శుద్ధి చేసే దిశగా జలమండలి అడుగులు వేస్తోంది. ఇందుకోసం పలు చోట్ల ఎస్టీపీలు నిర్మిస్తోంది. సీవరేజ్ ఓవర్ ఫ్లో ఫ్రీ సిటీ - హైదరాబాద్, ఇంకుడు గుంతల నిర్మాణమే లక్ష్యంగా జలమండలి 90 రోజుల ప్రత్యేక కార్యాచరణను అక్టోబర్ 2న చేపట్టింది.
ఈ 90 రోజుల స్పెషల్ డ్రైవ్‌లో దీర్ఘకాలికంగా ఉన్న సీవరేజ్ సమస్యలకు పరిష్కారం చూపడంతో పాటు భవిష్యత్తులో నీటి కరవు రాకుండా ఇంకుడుగుంతల నిర్మించుకునేలా చర్యలుచేపట్టింది. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న నల్లాబిల్లుల వసూలుకు ఓటీఎస్ స్కీం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. రెండునెలలు ఈ పథకం అందు ఉండగా 1.17 లక్షల మంది వినియోగదారులు రూ.102 కోట్ల విలువైన బిల్లులు చెల్లించి.. రూ.35 కోట్ల రాయితీ పొందారు.
ఈ ఏడాది జనవరి 1 నుంచి మొత్తం ఆదివారం నాటికి 16,43,660 ట్యాంకర్ ట్రిప్పులను జలమండలి సరఫరా చేసింది. ఈ యేడాది తమిళనాడులోని చెన్ను వాటర్ బోర్డు అధికారులు, రాష్ట్రానికి కేటాయించిన ట్రైనీ ఐఏఎస్ బృందం జలమం సందర్శించింది. బోర్డు పనితీరు, నీటి సరఫరా, ప్రాజెక్టుల గురించి తెలుసుకున్నారు. సర్వీస్ పీరియడ్‌లో చనిపోయిన 25మంది ఉద్యోగుల కుటుంబసభ్యులకు ఉపాధి కల్పించారు.