10-03-2025 01:07:29 AM
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
నల్లగొండ, మార్చి 9 (విజయక్రాంతి) : ఆలయాల అభివృద్ధికి రాష్ర్ట ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నదని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. చిట్యాల మండలం పెద్దకాపర్తిలోని తిరుమలనాథస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే వీరేశం స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. తిరుమలనాథుడి అనుగ్రహంతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి ఆకాంక్షించారు.
అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎంపీ, ఎమ్మెల్యేలను సన్మానించారు. అంతకుముందు గ్రామంలో రూ. 5 లక్షలతో చేపట్టనున్నసీసీరోడ్డు పనులకు వారు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ ముఖ్యనాయకులు, పలువురు అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.