22-04-2025 01:24:55 AM
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్ చెరు, ఏప్రిల్ 21 :శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని కొల్లూరు జంక్షన్, వెలిమల నుండి వెలిమల తాండ, పాటి గ్రామ పరిధిలో రూ.4.58 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న బీటీ రోడ్ల నిర్మాణ పనులకు సోమవారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల మున్సిపల్ పాలకవర్గం ప్రతిపాదించిన పనులకు సైతం ఆర్థిక శాఖ ద్వారా అనుమతులు మంజూరు చేయించి త్వరగా పనులు ప్రారంభిస్తామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. హెచ్‌ఎండిఏ పరిధిలోని చెరువులను సైతం ప్రణాళికబద్ధంగా అభివృద్ధి పరుస్తున్నామని తెలిపారు.
నిర్దేశించిన గడువులోగా అభివృద్ధి పనులను పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తెల్లాపూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రాములు గౌడ్, సర్పంచుల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోమిరెడ్డి, మాజీ సర్పంచులు లక్ష్మణ్, స్వామి గౌడ్, రాములు యాదవ్, పిఎసిఎస్ చైర్మన్ బుచ్చిరెడ్డి,
మున్సిపల్ కమిషనర్ సంగారెడ్డి, హెచ్‌ఎండిఏ డిఈ రామకృష్ణ, మాజీ కౌన్సిలర్లు రవీందర్ రెడ్డి, సుచరిత కొమరయ్య, శ్రీశైలం, చిట్టి ఉమేష్, బాబ్జి, శ్రీకాంత్, నర్సింలు, నాగరాజు, సీనియర్ నాయకులు రవీందర్ రెడ్డి, దేవేందర్ యాదవ్, వెంకటరామిరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, జంగా రెడ్డి, రాజు, పాల్గొన్నారు.