calender_icon.png 12 January, 2025 | 10:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమీన్‌పూర్ బల్దియా అభివృద్ధికి ప్రాధాన్యం

12-01-2025 12:00:00 AM

ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి

పటాన్‌చెరు, జనవరి 11 : అమీన్‌పూర్ మున్సి పాలిటీ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపా ల్‌రెడ్డి అన్నారు.  శనివారం మున్సిపల్ పరిధిలోని భవానిపురం, జవహర్ కాలనీ, బంధంకొమ్ము, అమీ న్‌పూర్ రెండవ వార్డులో సుమారు కోటి రూపా యల అంచనా వ్యయంతో చేపట్టిన అంగన్‌వాడిల పునరుద్దరణ, నూతన కమిటీ హాల్, ఐకేపీ భవనాలకు మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండు రంగారెడ్డి, వైస్ చైర్మన్ నందారం నర్సింహాగౌడ్‌తో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ  వేగంగా అభివృద్ధి చెందుతున్న అమీన్‌పూర్ మున్సిపాలిటీలోని కాలనీలకు అవసరమైన సౌకర్యాలను స్థానిక ప్రజాప్రతినిధుల  సహకారాలతో కల్పించి ప్రతి కాలనీని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. కాలనీలలో ప్రధానంగా సీసీ రోడ్లు, యూజీడీలు, పార్కులు తదితర అభివృద్ధి పనులకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.

అంగన్‌వాడీల పునరుద్ధరణకు సహకారం అందించిన కోకో కోలా సంస్థను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఆయా కాలనీ వాసులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, కాలనీ వాసులు ఎమ్మెల్యే, చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్  కౌన్సిలర్‌లు, కో ఆప్షన్స్ సభ్యులు, ఆయా కాలనీ వాసులు పాల్గొన్నారు.