calender_icon.png 28 October, 2024 | 10:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పర్యాటకాభివృద్ధికి ప్రాధాన్యత

28-10-2024 12:31:54 AM

దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ

యాదాద్రి భువనగిరి, అక్టోబరు27 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ఏకో, ఆధ్యాత్మిక పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర దేవాదాయ, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఆదివారం యాదగరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు జరిపారు.

అనం తరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఆలయాలను సందర్శించే భక్తులు సంతృప్తిగా తిరిగివెళ్లడానికి అనువుగా సౌకర్యాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. యాదాద్రి కొండ పై డార్మిటరీ, టాయిలెట్ , ఎల్‌ఈడీ టీవీ స్క్రీన్స్ ఏర్పాటు, కళాకారులను, కళలను ప్రోత్సహించడానికి కళావేదిక నిర్మాణం చేపట్టామన్నారు.

వృద్ధులు, వికలాంగుల కోసం బ్యాటరీ వాహనాలు, గర్భగుడి వరకు లిఫ్ట్ సదుపాయం కల్పించామన్నారు. ప్రసాదాల కౌంటర్లు అదనంగా ఏర్పాటు చేశామని, అన్న ప్రసాదాన్ని 600 నుంచి వేయిమందికి  పెంచినట్టుగా పేర్కొన్నారు.

స్వామివారి ఆలయ విమాన గోపురానికి స్వర్ణతాపడం పనులకు ప్రభుత్వం ఆమోదం ఇప్పటికే ఆమోదం తెలుపగా పనులు కూడా ప్రారంభించారన్నారు. రాష్ట్రంలోని అన్ని ఆలయాల అభివృద్ధి, సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా భగవంతుడి సేవలో నిమగ్నమై పనిచేస్తామని తెలిపారు.