calender_icon.png 19 November, 2024 | 10:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ వారికి ప్రాధాన్యత

12-11-2024 12:00:00 AM

తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ)కు ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచిన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చిత్ర పరిశ్రమ ఐదారు గురు పెద్దవారిదే కాదు, సినిమా పట్ల ఆసక్తి ఉన్న  తెలంగాణ ప్రజలందరిది. ‘మా భూమి’ నుంచి ‘బలగం’ వరకు తెలంగాణ వాళ్లు ఎన్నో గొప్ప చిత్రాలు తీశారు.

తెలంగాణలో సినిమా పరిశ్రమ బాగా అభివృద్ధి చెందాలనేది మా ప్రభుత్వ సంకల్పం. టీఎఫ్‌సీసీకు స్థలం ఇప్పించేందుకు ప్రభుత్వం తరపున ప్రయత్నం చేస్తాం. చిత్రపురి కాలనీలో కొత్తగా కట్టబోయే ఫ్లాట్లలో తెలంగాణ సినిమా వారికి ప్రాధాన్యత కల్పిస్తాం” అన్నారు. అంతకు ముందు రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ.. ‘టీఎఫ్‌సీసీ కార్యాల యాన్ని అద్దె భవనంలో నిర్వహిస్తున్నాం.

ఫిలింనగర్‌లో 800 గజాల స్థలం ఇప్పిస్తే, సొంత భవనం నిర్మించుకుంటాం. మా ఛాంబర్‌లో ఏ కార్మికునికీ చిత్రపురి కాలనీలో ఇల్లు ఇవ్వలేదు. అందరికీ ఇల్లు ఇప్పించాలని కోరుతున్నా” అన్నారు. రమేశ్ ప్రసాద్, టీఎఫ్‌సీసీ వైస్ ప్రెసిడెంట్ గురురాజ్, సెక్రటరీలు జేవీఆర్, కాచం సత్యనారాయణ, టీ మా ప్రెసిడెంట్ రశ్మి ఠాకూర్, సెక్రటరీ స్నిగ్ధ  పాల్గొన్నారు.