calender_icon.png 27 April, 2025 | 9:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థుల భవిష్యత్‌కు ప్రాధాన్యం

27-04-2025 12:32:23 AM

మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): విద్యారంగానికి, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యం త ప్రాధాన్యమిస్తున్నదని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం బేగంపేట్ టూరిజం ప్లాజాలో మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకులాల్లో చదివి ఇంటర్మీడియట్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఆయన సన్మానించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇక్కడికే పరిమితం కావొద్దని, లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని సూచించారు. కాగా తమ ప్రజా ప్రభుత్వం సహకారంతో అధికారుల నిరంతర పర్యవేక్షణతో  రాష్ట్రం లోని అన్ని వసతి గృహాలు, గురుకులాల్లో సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఈ కార్యక్ర మం లో బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ శ్రీధర్, టూరిజం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ స్మితా సబర్వాల్, బీసీ సంక్షేమ శాఖ కమిషన్ బాల మాయాదేవి, గురుకులాల సెక్రటరీ సైదులు, బీసీ సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు.