calender_icon.png 27 December, 2024 | 9:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాతాశిశు సంరక్షణకు ప్రాధాన్యం

26-12-2024 03:24:35 AM

  • రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి 
  • నల్లగొండ ఎంసీహెచ్‌కు రూ.30 లక్షల పరికరాలు అందజేత

నల్లగొండ, డిసెంబర్ 25 (విజయక్రాంతి): మాతాశిశు సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. నల్లగొండ జిల్లా కేంద్ర దవాఖానలోని మాతాశిశు సంరక్షణ కేంద్రానికి కోమటిరెడ్డి ప్రతీక్‌రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.30 లక్షల విలువైన వైద్య పరికరాలను బుధవారం అందించారు. అనంతరం మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానకు నిత్యం 1500 మంది అవుట్ పేషంట్లు, వెయ్యి మందికిపైగా ఇన్ పేషంట్లు వస్తున్నందున అందుకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ దవాఖానతోపాటు మాతాశిశు సంరక్షణ కేంద్రంలో అన్నివసతులు కల్పించి ఉస్మానియా, నీలోఫర్‌కు ధీటుగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.